ద్రవ జీవామృతం
కావల్సిన పధార్ధాలు :
దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు,
బెల్లం / నల్ల బెల్లం / చెరుకు రసం 4 లీటర్లు,
ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు,
బావి/బోరు/నది నీరు 200 లీటర్లు,
పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.
తయారీ:
తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి.
ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మరలా తయారుచేసుకోవాలి).
పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి.
ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు.
ఉపయోగాలు :
జీవామృతం ను 3 విధాలుగా ఉపయోగి0చవచ్చు.
1. నీటి తో కలిపి పారించడము:-2. రెండు మొక్కల మధ్యలో నేల మీద డైరెక్టుగా పోయడం 3. పిచికారి
1. నీటి తో కలిపి పారించడము:-
ఒక ఎకరానికి 200-400 లీ జీవామృతం ను నీటి తో పాటుగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు పారిoచడం మంచిది.
జీవామృతం ను తడి నెలలో ఉపయోగించడం మంచిది లేదంటే సాయంత్రం వేళలో జీవామృతంను కూడా వాడవచ్చు. వర్షా కాలపు వాతావరణం లో ఉపయోగించడం చాల ఉత్తమము.
వర్షాకాలం లో ఎంత జీవామృతం ను ఉపయోగిస్తే అంత మంచిగా ఉంటుంది నెలలోని సారం.
2. రెండు మొక్కల మధ్యలో నేల మీద ఒకటి లేదా రెండు కప్పులు డైరెక్టుగా పోయడం (తడి నేల లో పోయాలి) :-
పండ్ల చెట్లకి ప్రతి నెలకి ఒకసారి మధ్యాహ్నం చెట్టు నీడ పరిదిలో భూమి మీద వేయాలి.
మొదటి 6 నెలలు ప్రతి ఒక్క మొక్కకి 100 ML నెలకి , తరువాతి 6 నెలలు నెలకు200 ML .
తరువాతి 12 నెలలు నెలకు 500 ML ,
రెండు సంవత్సరాల తర్వాత 1 లీ జీవామృతం ఒక మొక్కకి. , 3 సంవత్సరం నుంచి మొక్కకి 2 లీ. నెలకు చొప్పున ఉపయోగించాలి.
జీవామృతం ను బట్టతో 2 సార్లు వడపోసి ఎకరానికి 2 - 4 లీ . పిచికారిగా ఉపయోగించవలెను.
ఇలా పిచికారీ చేయడం వల్ల మొక్కలు బాగా బలంగా తయారై ఆకుల వైశాల్యం పెరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచే శక్తి వస్తుంది.
మొక్కలకు రోగ నిరోధక శక్తి వస్తుంది. జీవామృతం మొక్కలకు అవసరమైన సూక్ష్మజీవుల ను దగ్గర చేసి. మొక్కలకి హాని కలిగించే సూక్ష్మజీవుల ను నశింపచేస్తుంది.
జీవామృతం ఒక మంచి ఫంగస్ నివారినిగాను, వైరస్ నివారింగాను ఉపయోగపడుతుంది. ఖరీఫ్ / రబీ పంటలలో ఋతు సంబంధ పంటలలో:-
3. పిచికారి :-
1) విత్తులు లేదా మొక్కలు నాటిన వెంటనే 100 లి. నీటి లో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
2) 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
3) 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
4) గిoజలు పాలుపోసుకునే దశలో లేదా పూలు మొక్కలు ఐతే మొగ్గ దశలో 200 లి,. నీటిలో 5 -6 లి. పుల్లటి (3 రోజులు పులిసిన ) మజ్జిగ ను పిచికారీ చెయ్యాలి.
పండ్ల తోటల్లో :-
1. పండ్లు కోతలు ముగిసిన వెంటనే 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
2. కొత్త చిగుర్లు వచ్చేప్పుడు ఆకులు ఎర్ర రంగునుంచు వచ్చేప్పుడు 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
3. పూత వచ్చిన సమయంలో 200 లి. నీటిలో 200 లి. దసపరిని కాషాయం లేదా 20 లి. నీమాస్రం ని ఉపయోగించాలి. మల్లీ 21 రోజులు తర్వాత మల్లి పిచికారీ చేయాలి.
4. పండ్లు చిన్నగ ఉన్నపుడు 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
5. పండ్లు మీడియంగా కయ దశలో ఉన్నపుడు 200 లి. నీటిలో సప్త ధాన్యంకురా కషాయం ను పిచికారీ చెయ్యాలి.
కొత్త తొట్లలో :-
1) నాటిన నెల రోజులకి , ఎకరానికి 100 లీ. నీటిలో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
2) 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .
3) 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
4) నెల రోజుల తర్వాత 200 లి. నీటిలో 5 - 6 లి. పుల్లటి మజ్జిగ
5) నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
6) నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.
ఘన జీవామృతం
ఒక ఎకరానికి కావాల్సిన పదార్ధాలు:
దేశీయ ఆవు పేడ 100 కేజీలు,
దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు,
బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు,
ద్విదళ పప్పుల పిండి (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు,
పుట్ట మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు
తయారీ:
పైన పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి.
పూర్తిగా ఆరిపోయిన తర్వాత పొడిగా చేసుకొని గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి
మరో ఘన జీవామృత రూపం :
200 కేజీల బాగా క్రుళ్ళిన ఆవు పేడ,
తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.
తయారీ:
ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది.
ఒక ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి.
పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు అందించవచ్చు.