- ప్రకృతి వ్యవసాయం మూడు విధానాలు.. బీజామృతం, ఘనామృతం, జీవామృతం.. వీటికి ఆవు మూత్రాన్ని, పేడను వినియోగించ వచ్చు.
- బీజామృతం అంటే విత్తన శుద్ధి. 20 లీటర్ల నీరు, ఐదు లీటర్ల ఆవు మూత్రం, ఐదు కేజీల ఆవు పేడ మిశ్రమాన్ని కలిపి రాత్రంతా వుంచి తదుపరి రోజు విత్తనాలను శుద్ధి చేసి వాటిని నాటినట్లయితే 90 శాతం మొలకెత్తుతాయి.
- ఘనామృతం ఆవు పేడతో దీన్ని తయారు చేసుకోవచ్చు. 200 కేజీల ఎండిన ఆవు పేడ జల్లిడ పట్టి దీనిలో 20 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఎండ బెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ ఘనామృతాన్ని చివరి దుక్కిలో, పంట కాపు దశలో పంటకు వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
- జీవామృతం అంటే ఆవు మూత్రంతో తయారు చేసేది. 200 లీటర్ల ఆవు మూత్రం ఒకటి రెండుసార్లు సాగు నీటితో పాటు పంటలకు అందించాలి. పంటలకు నాలుగు నుంచి ఐదుసార్లు జీవామృతం పిచికారి చేయాలి. దీంతో చీడ పీడలను నివారించు కోవచ్చు. 200 లీటర్లలో ఐదు నుంచి పది లీటర్లు గో మూత్రం, పది కేజీల ఆవు పేడ, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ పప్పుల పిండి, పిడెకెడు పుట్ట మన్నుతో వీటిని కలిపి 48 గంటలు నిల్వ చేయాలి.
- ద్రవ, ఘన జీవామృతాలు పంటలకు వినియోగించటం వలన నత్రజని పుష్కలంగా లబిస్తుంది. ఫాస్పేట్ నేలలో పుష్కలంగా వుంటుంది. పొటాష్ కూడా ఇదే రకంగా మొక్కలకు అందుతుంది. ఫ జీవద్రవ్యం కూడా భూమిలో పెరగటం వలన మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవామృతం వలన భూమిలోని వానపాములు సంచరించటం పెరుగుతుంది. దీని వలన భూమి 15 అడుగుల లోతు వరకు రంధ్రాలు ఏర్పడతాయి. కురిసిన వర్షం పూర్తిగా భూమిలోకి ఇంకుతుంది.
- 200 లీటర్ల నీటిలో 50 లీటర్ల గో మూత్రం, ఐదు లీటర్ల పుల్లటి మజ్జిగ కలిపి పంటలకు పిచికారి చేసినట్లయితే వైరెస్ వంటి ప్రమాదకర తెగుళ్లను నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించవద్దు. రైతులే ప్రత్యేక మార్కెట్‌ను రైతులు రూపొందించుకోవాలి.
- ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం ఆర్జించవచ్చు. యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెరి వంటి పంటలను కూడా ఆంధ్రప్రదేశ్ అనుకూలం.
- ఇలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ వుంది. అధిక రేట్లు లబిస్తున్నాయి. రైతు బజారుల్లో ఇలాంటి ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. శాసనసభ, శాసన మండలిలో కూడా ప్రకృతి వ్యవసాయంపై నిర్మాణత్మక చర్చ జరగాలి.
- భూమిలో జీవన ద్రవ్యం(హ్యూమస్) మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవనద్రవ్యం ప్రకృతి వ్యవసాయం వల్ల భూమిలో పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర్ పంటలు సాగు చేయాలి. ఒక దేశీయ ఆవు నుంచి వచ్చే పేడ, మూత్రం ద్వారా 30 ఎకరాల్లో పంటలను సాగు చేయవచ్చు. చీడ, హైబ్రీడు, జర్మనేషన్ విత్తనాలు కన్నా దేశీయ విత్తనాలే మేలు. దేశీయ విత్తనాలు అందుబాటులో లేకపోయినా సంకర విత్తనాలను దేశీయ విత్తనాలుగా మార్చుకొనే అవకాశం వుంది. ప్రకృతి వ్యవసాయంలో సాగు నీరు, విద్యుత్ 90 శాతం ఆదా అవుతుంది. ఇలా పండించిన పంటలు ఆరోగ్యకరంగా వుంటాయి. పల్లెలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. పట్టణాలకు రైతుల వలసలను, ఆత్మహత్యలను నిరోధించవచ్చు.
Monday, January 13, 2020
ప్రకృతి వ్యవసాయం చేసే విధానాన్ని పాలేకర్ రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆయన మాటల్లోనే ఇలా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment