Showing posts with label మట్టిలో బంగారం / మట్టితో బంగారం. Show all posts
Showing posts with label మట్టిలో బంగారం / మట్టితో బంగారం. Show all posts

Friday, December 27, 2019

మట్టిలో బంగారం


మట్టి మనిషి 

1. మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు ఉంటే పంటలు అధ్బుతంగా పండుతాయి. 

2. వానపాములు రోజుకు 150 జతల ఎడ్లు చేసినంత పని చేస్తాయి. ఇవి భూమికి బొరియలు చేస్తూ నేలను గుల్లబరచడమే కాకుండా 15 అడుగుల లోతు మట్టిలో నుంచి పోషకాలను మొక్కల వేళ్ళకు అందిస్తాయి. వానపాముల ద్వారా ఎకరానికి ఏటా 90 కిలోల నత్రజని సహజంగానే అందుతుంది. 

3. అచ్చాదనం (మల్చింగ్) లో చెట్లనుండి రాలిన ఆకులు, పువ్వులు మట్టిలో కలిసేలా చూడాలి.

 4. పంట కోత కాలం తర్వాత ఆకులను, మొక్కలను కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగించవచ్చు.

 5. ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగు చేయవచ్చు.

 6. దేశీయ ఆవు పేడలో కోట్ల మిత్ర సూక్ష్మ జీవులు ఉంటాయని పాలేకర్ రుజువు చేశారు.

 7. ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోను 7 రోజుల లోపు పేడనే వేయాలి.

 8. ఏదో ఒకే రకం పంట వేయకూడదు. అనేక రకాల పంటలు, ఏళ్ళ తరబడి పెరిగే చెట్లను కలిపి పెంచాలి.

 9. రైతు వేసే ప్రధాన పంటలతోపాటు ఒకటి, రెండు అంతరపంటలు కూడా వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.

 10. కలుపు మొక్కలను అచ్చాదన కోసమే ఉపయోగించాలి. కనుక కలుపు మందులు వాడరాదు.

 11. పురుగు మందులు వాడరాదు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి అవసరాన్ని బట్టి ఏదో ఒక కీటకనాశని వాడితే సరి.

 12. ఏ పంట అయినా మొక్కకు మొక్కకు మధ్య సరిపోయే దూరం ఉండాలి.

 13. సేంద్రీయ వ్యవసాయంలో కూలీల ఖర్చు తప్ప రసాయన మందుల ఖర్చు ఉండదు.

 14. సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టిన 2, 3 సంవత్సరాల వరకూ ఎటువంటి ఆదాయాలు కనిపించవు. స్వల్ప ఆదాయం మాత్రం కనిపిస్తుంది. 4వ/ 5వ సంవత్సరాల నుండి అధిక లాభాలు కనిపిస్తాయి.

 15. ప్రాకృతిక వ్యవసాయంలో పెట్టుబడి వుండదు కావున రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి.

 16. సేంద్రీయ వ్యవసాయం వలన ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.

 17. రసాయన పద్ధతిలో పండించే పంటలకంటే పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు ఎక్కువ మద్దత్తు ధర లభిస్తుంది.

 18. సేంద్రీయ వ్యవసాయంలో నీటి ఖర్చు, కరెంటు ఖర్చు తగ్గుతుంది.

 19. సేంద్రీయ వ్యవసాయానికి రైతులు బ్యాంకులనుండి అప్పులు చేయక్కర్లేదు, ప్రభుత్వము రైతులకు రుణమాఫీలు చేయక్కర్లేదు.

 20. సేంద్రీయ వ్యవసాయం వలన వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది