Showing posts with label సూశ్మజీవులు మొక్కల సహజీవనం / బాక్టీరియా. Show all posts
Showing posts with label సూశ్మజీవులు మొక్కల సహజీవనం / బాక్టీరియా. Show all posts

Thursday, December 26, 2019

సూశ్మజీవులు మొక్కల సహజీవనం


సూక్ష్మ జీవి అనునది మనం కంటితో నేరుగా చూడలేని జీవి.

ఇవి సామాన్యముగా మానవ శరీరము మీద , జంతువుల /మనుష్యుల ప్రేగుల లోపల మన ఇంటి లోపల , గాలిలో ,నీటిలో వుంటాయి.


సూక్ష్మజీవుల జాతి భేదములు

సూక్ష్మ జీవులలో 

1 . సూక్ష్మ జంతువులు.

2 . శిలీంద్రములు

3 . బాక్టేరియములు .

అను ఈ మూడు ముఖ్య విభాగాలు ఉన్నాయి.

మనం తెలుసుకోవలసినది ముఖ్యముగా

సూక్ష్మ జీవులు మొక్కల మధ్య సహజీవనం:

వివిధ రకాల సూక్ష్మ జీవులు మొక్కకు కావలసిన పోషక పదార్థాలను నేల పొరల్లో ఉండే వాతావరణం మరియు మట్టినుండి గ్రహించి మొక్కకు అందిస్తాయి. ఈ సూక్ష్మ జీవులకు కావలసిన కార్బోహైడ్రేట్సు మొక్కల వేర్ల ద్వారా వాటికి అందుతాయి.

మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి. 

మొక్కలు పోషకపదార్థాలను నేరుగా గ్రహించవు

మొక్కలు వాటి ఆకులలోని స్టోమాట ద్వారా సౌరశక్తిని,కార్బన్ డైయాక్సైడ్ ను తీసుకొని ఆకులలో నిల్వఉంచుతుంది. 

సౌరశక్తి ద్వారా కార్బన్ డైయాక్సైడ్ కార్బన్ మరియు ఆక్సిజన్లుగా విడగొట్టబడతాయి.

మొక్క వెర్లనుండి గ్రహించిన నీటిఆవిరి కార్బన్ కలిసి కార్బోహైడ్రేట్స్ గా ఏర్పడతాయి. 

1 చదరపు వైశాల్యం గల ఆకు ఒక రోజుకు 4 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను తయారుచేస్తుంది. 

ఇలా ఉత్పత్తి ఐన కార్బోహైడ్రేట్స్ లో కొంత పరిమాణం మొక్క శ్వాసక్రియకు మొక్కఎదుగుదలకు ఉపయోగపడుతుంది, 

కొంత పరిమాణం మొక్కల వేర్లు ద్వారా సూక్ష్మజీవులకు అందిస్తాయి. 

అందుకు బదులుగా ఈ సూక్ష్మజీవులు నేల నుండి పోషకాలను గ్రహించి వాటిని వేర్లకు అందిస్తాయి. 

కోటాను కోట్ల అనేక రకాల మేలు చేసే సూక్ష్మ జీవులు మనకు దేశవాళీ ఆవు పేడ, మూత్రం నుండి లబిస్తాయి. వీటి సంఖ్యను లెక్కకు మించి మనము జీవామృతం  తయారీ చేత పొందవచ్చు.