Friday, January 3, 2020

బీజామృతం

కావల్సిన  ధార్ధాలు :

బోరు/బావి/నది నీరు 20 లీటర్లు, 

నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, 

నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), 

పొడి సున్నం 50 గ్రాములు, 

పుట్ట మట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.


తయారీ:

ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. 

 ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. 

 రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. 

 పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి. 

 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. 

 అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.


ఉపయోగాలు :

బీజామృతం ను విత్తన శుద్ధి కి ఉపాయొగిస్తాము. 

 బీజామృతం తో బీజాలను శుద్ధి చేయడం అన్నది అతి ముఖ్యమైన ప్రక్రియ. ఇందువలన గింజలు ఎక్కువ శాతం మొలకెత్తుతాయి. 

 భూమి నుంచి విత్తనం నుంచి వచ్చే రోగాలను తెగుళ్లను మొక్క తట్టుకోగల సామర్థ్యం మొక్కలకి వస్తుంది. 

 మొలకెత్తిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోవడం లాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు మరియు మొక్కలు కి వైరస్ ల నుండి తట్టుకునే సామర్థ్యం పెరిగి రోగ నిరోధక శక్తీ వస్తుంది. 


No comments:

Post a Comment