Wednesday, January 22, 2020

భుసార పరీక్ష వివరాలు

సత్యర భూసార పరీక్ష చేయుటకై సమూనాను సిద్ద౦ చేయుట :

సేకరి౦చిన నమూనాను ఒక పళ్లెమూపై పరచి గుండ్రాయినికాని , రోకలితో గాని మెత్తటి పొడిగా మార్చి 1/4 వ౦తు మట్టి నమూనాని శుభ్రమైన ప్లాస్టిక్ స౦చిలో సేకరి౦చి స౦బ౦ధిత సమాచారన్ని ఒక కాగితములో రాసి దానిలో వేయాలి.

నమూనాలను పైరు కోయగానే ముఖ్యంగా వేసవి కాలంలో సేకరించితే మ౦చిది.


సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచిక :


  • 5 గ్రా . మట్టి నమూనాను చె౦చాతో కొలిచి బీకరులో వెయ్యాలి
  • 2 గి౦జల పరిమాణము గల బోగ్గు పొడిని అ౦దులో వెయ్యాలి
  • 10.మి.లీ .పి.హె.ద్రావకం-1 అందులో పోయాలి(10 ml కొలత పరిమాణ౦నుపమోగించి).
  • ఒక పరీక్ష నాళిక తీసుకొని దానిలో గరాటును పెట్టాలి.
  • గు౦డ్రముగానున్నఫిల్టర్ పేపర్ను తీసుకొని నాలుగు మడతలుగా చేసి ,మూడు భా భాగములని ఒకవైపున కు మడచి, కొను ఆకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి.అది గరాటునకు అతుకుకోనుటకు కిట్లో వున్నడిస్టేల్ నీళ్లతో తడపాలి.
  • గాజుకడ్డీతో బీకరులోవున్న మట్టి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు కలపాలి.
  • తరువాత నెమ్మదిగా బీకరులో వున్న ఈద్రవన్ని ఫిల్టర్ పేపరుపై పోయాలి.
  • 2 మి.లీ .వడబోసిన ద్రవాన్నిసేకరి౦చాలి.
  • 3-4 చుక్కలు పిహెచ్ - 2 ద్రావకాన్ని అందులో డ్రాపరుతో వేసి బాగా ఆడించాలి .
  • పరీక్షా నాళికలోని ద్రవము రంగును పిహెచ్ కలర్ చార్టుతో పోల్చి నమూనా యొక్క ఉదజని సూచికను నిర్ణయించాలి.
ఉదజని సూచన విశ్లేషణ ఫలితాలు:
పిహెచ్పంటలకు అనుకూలము
9అన్ని పంటలకు హానికరము
8-9చాల పంటలకు హానికరము
6-8అన్ని పంటలకు హానికరము
5-6చాల పంటలకు హానికరము
0-5అన్ని పంటలకు హానికరము
కర్బునము స్ధాయి నిర్ణయి౦చు విధాన౦ :
  • ఒక పరీక్షా నాలికలో 1 గ్రా .చిన్మ చెరిచాతో మట్టి నమూనాను తీసుకోవాలి.
  • పరీక్ష నాళికలో 2 మి-లీ- కర్చనపు-1 ద్రావకాన్ని వేసి కలషాలి (lOml కొలత పరిమాణ౦ నుపయోగిరిచి).
  • ఆ తరువాత 2 మి.లీ. కర్చనపు -2 ద్రాపకాన్ని వేసి డ్రాపరు ద్వారా పరీక్త నాళీకసు కలపాలి.ఈ ద్రవము యాసిడ్. కావున జాగత్తగా వెయ్యాలి.
  • ఇట్టీ రసాయనాలసు కలపినపడు పరీక్షా నాళీక అ౦చుల ద్వారా నెమ్మదిగా పదులుతూ పరీక్త నాళికసు పలయాకారములో తిపాఎలి.
  • ఈ విధముగా కలిపిన పరీక్త నాళీకసు స్టా౦డులో 5 నిమిషాలు ఉ౦ఛాలి.
నత్రజని స్థాయి నిర్డయి౦చు విధానము:
  • మట్టీ కలిపె బాటిళ్లో చిన్న చె౦చాతో 1 గ్రా. మట్టి నమూనాను తీసుకోవాలి.
  • కొలత పరిమాణ౦ సహయముతో 10 మి.లీ. నత్రజని ద్రావకం -1 ను వెయ్యాలి.
  • బాటిల్ మూత గట్టీగా బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమా౦తరముగా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి- మళ్లీ బాటిల్ లోని ద్రాపకాన్ని 2 నిమిషాలు కలపాలి.
  • ఒక పరీక్త నాళికలో ఫీల్డర్ పేపరుతో ఉన్నగరాటు పేట్టీ బాటిల్ లోని ద్రాపకాన్ని పోసి పడపోయాలి
  • 5 మి .లీ . పడబోసిన ద్రాపకాన్ని సేకరించాలి. రె౦డు గి౦జల పరిమాణము నత్రజని-2 పొడిని చిన్నచె౦చా సహాయముతో పరీక్త నాళికలో వేసి 2 నిమిషాలు బాగా కలపాలి.
  • పరీక్ష నాళికసు స్టా౦డులో 10 నిమిషాలు కుదుపకు౦డా ఉ౦చాలి.
  • పరీక్ష నాళికలో ద్రవము యొక్క ర౦గుసు నత్రజని ర౦గుల చార్టతో పోలిఎ మట్టి సమూనా యొక్క నత్రజని స్ధాయిని నిర్డయించాలి.
భాస్వరము స్ధాయి నిరణయంచు విధానము:
  • మట్టీ కలిపె బాటిలో పెద్ద చెంచను ఉపయోగించి ఒక చె౦చా అనాగ 2.0గ్రా. మట్టి సమూనాను తీసుకోవాలి.
  • సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడిని దీనిలో వెయ్యాలి.
  • భాసరపు ద్రావకము-1 ను ఉపయోగించి వాటిలో 20 మి.లీ.పొయ్యాలి. బాటిల్ మెక్క గట్టీగా మూసివేసి 3 నిమిషాలు నేలకు సమా౦తరము గా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి. మళ్ళి బాటిల్ లోని ద్రావకాన్ని నిమిషాలు కలపొలి.
  • ఓపరీక్ష నాళికలో పిల్టర్ పెపరుతో వున్న గరాటు పెట్టి బాటిల్లోని ద్రావకన్నిపోసి వడబోయ్యాలి.
  • 5.మి.లి .వడబోసినద్రావకాన్ని సేకరించాలి.(౩-4 చుక్కలు)భాస్వరము -2ద్రావాకము అందులో డ్రాపరుద్వారావేసినెమ్మదిగా కలపాలి. ఇలా చేసినప్పుడు పరీక్షనాళికలో బుడగలువచ్చును.
  • 4 మి.లీ.భాస్వరము(౩)ద్రావకన్ని కలపాలి. ఆ తరువాత చిన్నగొధుమ గింజ అంత(కోలత పరిమాణ౦నుపమోగించి)భాస్వరము(4)రసాయనాన్ని(పొడిని) అందులో వేసిబాగా కలపాలి.
  • ఈ పరీక్షనాలికను స్టా౦డులో 10 నిముషాలు ఉంచాలి.
  • పరీక్ష నాళికలో ద్రవము మొక్క రంగును భాస్వరము రంగుల చార్టుతో పోల్చనమూనా మొక్క భాస్వరము స్థాయిని నిర్ణయి౦చాలి.
పొటాష్ స్ధాయి నిర్ణయి౦చు విధానము:
  • మట్టీ కలిపె బాటిల్ ల్లో పెద్ద చె౦చాను ఉపయోగి౦చి ఒక చెంచా అనగా 2 గ్రా మట్టీ నమూనాసు తీసుకొని దానికి కొలత పరిమాణంతో10 మి.లీ . పొటాష్-1 ద్రావకాన్ని పోసి మూత పెట్టీ భూమికి సమాంతరముగా 2 నిమిషములు కలపాలి
  • పరీక్ష నాళికలో ఫిల్డర్ పేపరువున్న గరాటు పెట్ఠాలి.
  • కలిపిన తరువాత బాటిల్ లొని ద్రావకాన్ని గరాటులో పోసి వడబోయాలి.
  • పరీక్ష నాళికలో 5 మి-లీ. వడగట్టీన ద్రవాన్నిసేకరించాలి.
  • పరీక్ష నాళికలో పొటాష్-2 ద్రాపకాన్ని 3,4 చుక్కలు వడగఱ్ఱిస ద్రావకములో వేసి బాగా కలపాలి.
  • తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లా౦టి తెల్లటి ర౦గు ఏర్పడుతుంది.
  • ఈ తెల్లటి ఫాలలా౦టి రంగుసు పొటొష్ చార్టుతో పోల్చి నమూనాలో పొటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి.
గ౦ధకపు స్ధాయి నిర్డయి౦చు విధానము:
  • ఒక పరీక్ష నాళీకలో 2 గ్రా. మట్టీ నమూనాను తీసుకోవాలి.
  • సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడి దీనిలో వేయాలి ( 2 గింజలు)
  • గ౦ధకపు ద్రావకము-1 కొలత పరిమాణం సహయంతో 10 మి.లీ. పోయాలి.
  • పరీక్ష నాళిక మూతికి రబ్బరు కార్క బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమాంతరముగా ఆడి౦చిన తరువాత స్టా౦దులో ఉ౦చాలి.
  • వేరే పరీక్ర నాళిక తీసుకొని దానిలో గరాటు పెట్టాలి.
  • గుండ్రముగా నున్నఫీల్టర్ పేపరుసు తీసుకొని నాలుగు మడతలుగా చేసి మూదు భాగములను ఒకనైపుకు మడిచి కోసు అకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి. అది గరాటుసకు అతుకు కొనుటకు కిట్ లో పున్నడిస్టిల్ నీళ్లతో తడపాలి
  • పరీక్ష నాళికాలో పోరాష్-2 ద్రావకాన్ని 3,4 చుక్కలు వడగట్టిన ద్రావకములో వేసి బాగా కలపాలి.
  • తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లాంటి తెల్లటి రంగు ఏర్పడుతుంది.
  • ఈ తెల్లటి పాలలాంటి రంగును పోటాష్ చర్టుతో పోల్చి నముఉనాలో పోటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి
సున్నపు స్ధాయిని నిర్డయి౦చు విధానము:
  • ఒక గాజు ముక్య మీదగాని ,స్టిక్ కాగితము మీదగావి కొర్థిపొటి మట్టి సమూనాసు (2 గ్రా.) వేయాలి.
  • ఈ మట్టి నమూనా మీద సున్నపు నేల ద్ర్రాపకమును డ్రాపరు ద్వారా 3-4 చుక్కలు వేయాలి.
  • ఇలా వేసినపప్పుడు మట్టి ను౦డి బుడగలు బుడగలుగా ఏరఎడును.
  • మట్టీలో బుడగలు ఏరఎడక పోతే నమూనా సున్నప్ప నేల కాదని , బుడగలు కొద్ది మాతమే ఏరఎడిసచో కొద్ది స్థాయిలో భూమిలో సున్నం ఉన్నదని, బుడగలు తప్ర౦గా ఉ౦టే ఎకువ స్టాయిలో భూమిలో సున్నము ఉన్నదని నిర్ణయి౦చుకోవాలి
సిఫారస్ చేసిన ఎరువుల మోతాదు :

పోషక విలువలు తక్కవ ఉన్నచో సిఫారస్ చేపిసే ఎరుపు మోతాదు క౦టే 33 % ఆధిక౦గా వాడాలి.పోషక విలువలు అధిక౦గా ఉన్నట్లయితే సిఫారస్ చేసిన మోతాదు కన్నా౩౩ % తక్కవ వెయ్యాలి. పోషక విలువలు మధ్యస్థ౦గా ఉన్నట్లయిలే సిఫారన్ చేసిస మోతాదు పుకారంగా వాడాలి.

Monday, January 13, 2020

ప్రకృతి వ్యవసాయం చేసే విధానాన్ని పాలేకర్‌ రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఆయన మాటల్లోనే ఇలా..


  • ప్రకృతి వ్యవసాయం మూడు విధానాలు.. బీజామృతం, ఘనామృతం, జీవామృతం.. వీటికి ఆవు మూత్రాన్ని, పేడను వినియోగించ వచ్చు.
  • బీజామృతం అంటే విత్తన శుద్ధి. 20 లీటర్ల నీరు, ఐదు లీటర్ల ఆవు మూత్రం, ఐదు కేజీల ఆవు పేడ మిశ్రమాన్ని కలిపి రాత్రంతా వుంచి తదుపరి రోజు విత్తనాలను శుద్ధి చేసి వాటిని నాటినట్లయితే 90 శాతం మొలకెత్తుతాయి.
  •  ఘనామృతం ఆవు పేడతో దీన్ని తయారు చేసుకోవచ్చు. 200 కేజీల ఎండిన ఆవు పేడ జల్లిడ పట్టి దీనిలో 20 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఎండ బెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ ఘనామృతాన్ని చివరి దుక్కిలో, పంట కాపు దశలో పంటకు వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
  •  జీవామృతం అంటే ఆవు మూత్రంతో తయారు చేసేది. 200 లీటర్ల ఆవు మూత్రం ఒకటి రెండుసార్లు సాగు నీటితో పాటు పంటలకు అందించాలి. పంటలకు నాలుగు నుంచి ఐదుసార్లు జీవామృతం పిచికారి చేయాలి. దీంతో చీడ పీడలను నివారించు కోవచ్చు. 200 లీటర్లలో ఐదు నుంచి పది లీటర్లు గో మూత్రం, పది కేజీల ఆవు పేడ, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ పప్పుల పిండి, పిడెకెడు పుట్ట మన్నుతో వీటిని కలిపి 48 గంటలు నిల్వ చేయాలి.
  •  ద్రవ, ఘన జీవామృతాలు పంటలకు వినియోగించటం వలన నత్రజని పుష్కలంగా లబిస్తుంది. ఫాస్పేట్‌ నేలలో పుష్కలంగా వుంటుంది. పొటాష్‌ కూడా ఇదే రకంగా మొక్కలకు అందుతుంది. ఫ జీవద్రవ్యం కూడా భూమిలో పెరగటం వలన మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవామృతం వలన భూమిలోని వానపాములు సంచరించటం పెరుగుతుంది. దీని వలన భూమి 15 అడుగుల లోతు వరకు రంధ్రాలు ఏర్పడతాయి. కురిసిన వర్షం పూర్తిగా భూమిలోకి ఇంకుతుంది.
  •  200 లీటర్ల నీటిలో 50 లీటర్ల గో మూత్రం, ఐదు లీటర్ల పుల్లటి మజ్జిగ కలిపి పంటలకు పిచికారి చేసినట్లయితే వైరెస్‌ వంటి ప్రమాదకర తెగుళ్లను నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించవద్దు. రైతులే ప్రత్యేక మార్కెట్‌ను రైతులు రూపొందించుకోవాలి.
  •  ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం ఆర్జించవచ్చు. యాపిల్‌, ద్రాక్ష, స్ట్రాబెరి వంటి పంటలను కూడా ఆంధ్రప్రదేశ్‌ అనుకూలం.
  •  ఇలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వుంది. అధిక రేట్లు లబిస్తున్నాయి. రైతు బజారుల్లో ఇలాంటి ఉత్పత్తులను అమ్ముకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి. శాసనసభ, శాసన మండలిలో కూడా ప్రకృతి వ్యవసాయంపై నిర్మాణత్మక చర్చ జరగాలి.
  •  భూమిలో జీవన ద్రవ్యం(హ్యూమస్‌) మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవనద్రవ్యం ప్రకృతి వ్యవసాయం వల్ల భూమిలో పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర్‌ పంటలు సాగు చేయాలి. ఒక దేశీయ ఆవు నుంచి వచ్చే పేడ, మూత్రం ద్వారా 30 ఎకరాల్లో పంటలను సాగు చేయవచ్చు. చీడ, హైబ్రీడు, జర్మనేషన్‌ విత్తనాలు కన్నా దేశీయ విత్తనాలే మేలు. దేశీయ విత్తనాలు అందుబాటులో లేకపోయినా సంకర విత్తనాలను దేశీయ విత్తనాలుగా మార్చుకొనే అవకాశం వుంది. ప్రకృతి వ్యవసాయంలో సాగు నీరు, విద్యుత్‌ 90 శాతం ఆదా అవుతుంది. ఇలా పండించిన పంటలు ఆరోగ్యకరంగా వుంటాయి. పల్లెలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. పట్టణాలకు రైతుల వలసలను, ఆత్మహత్యలను నిరోధించవచ్చు.

Sunday, January 5, 2020

అంతర పంటలు,సహవాస పంటల ప్రణాళికా


అంతర పంటలు,సహవాస పంటలను సాగు అవసరాన్ని బట్టి పలువిధాలుగా వేసుకోవచ్చు.  

ఎంపిక చేసిన ప్రధాన పంటను బట్టి అంతరపంటను పక్క పక్క సాళ్లలో సాలు విడిచి సాలు సాగు చేసుకోవచ్చు.లేదా మొక్క తర్వాత మొక్క వేసుకోవచ్చు.  

ఉదాహరణకు 

మిరపలో ఉల్లి,వెల్లుల్లి అంతరపంటలుగా సాగు చేయధలిచినప్పుడు మిరపమొక్క తరువాత వరుసల్లో మొక్కకు మొక్కకు మద్య ఉల్లి నాటుకోవాలి. 60 సెంటీమీటర్ ఎండలో దాదాపు 10 సెంటీమీటర్ లకు ఒకసారి ఉల్లి,ఎల్లుల్లి తరువాత తిరిగి మిరప మొక్క వేసుకోవాల్సి ఉంటుంది.  

సహవాస పంటలు సాగు చేయడానికి పలు విధానాలు ఆచరణలో ఉన్నాయి.వేరు వేరు మొక్కల సహవాస జాతులను ఒకదాని తరువాత ఒకటి వేయడం వలన వాటి మద్య సయోధ్య బలపడి ప్రధాన పంటకు మేలు చేస్తుంది.

Friday, January 3, 2020

బీజామృతం

కావల్సిన  ధార్ధాలు :

బోరు/బావి/నది నీరు 20 లీటర్లు, 

నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, 

నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), 

పొడి సున్నం 50 గ్రాములు, 

పుట్ట మట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.


తయారీ:

ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. 

 ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. 

 రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. 

 పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి. 

 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. 

 అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.


ఉపయోగాలు :

బీజామృతం ను విత్తన శుద్ధి కి ఉపాయొగిస్తాము. 

 బీజామృతం తో బీజాలను శుద్ధి చేయడం అన్నది అతి ముఖ్యమైన ప్రక్రియ. ఇందువలన గింజలు ఎక్కువ శాతం మొలకెత్తుతాయి. 

 భూమి నుంచి విత్తనం నుంచి వచ్చే రోగాలను తెగుళ్లను మొక్క తట్టుకోగల సామర్థ్యం మొక్కలకి వస్తుంది. 

 మొలకెత్తిన తర్వాత కొన్ని మొక్కలు చనిపోవడం లాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు మరియు మొక్కలు కి వైరస్ ల నుండి తట్టుకునే సామర్థ్యం పెరిగి రోగ నిరోధక శక్తీ వస్తుంది. 


Thursday, January 2, 2020

జీవామృతం


ద్రవ జీవామృతం

కావల్సిన ధార్ధాలు :

దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు, 

బెల్లం / నల్ల బెల్లం / చెరుకు రసం 4 లీటర్లు, 

ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు, 

బావి/బోరు/నది నీరు 200 లీటర్లు, 

పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.


తయారీ:

తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి. 

 ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మరలా తయారుచేసుకోవాలి). 

 పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. 

 ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు. 


ఉపయోగాలు : 

 జీవామృతం ను 3 విధాలుగా ఉపయోగి0చవచ్చు. 

 1. నీటి తో కలిపి పారించడము:-2. రెండు మొక్కల మధ్యలో నేల మీద డైరెక్టుగా పోయడం 3. పిచికారి

 1. నీటి తో కలిపి పారించడము:-

 ఒక ఎకరానికి 200-400 లీ జీవామృతం ను నీటి తో పాటుగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు పారిoచడం మంచిది. 


 జీవామృతం ను తడి నెలలో ఉపయోగించడం మంచిది లేదంటే సాయంత్రం వేళలో జీవామృతంను కూడా వాడవచ్చు. వర్షా కాలపు వాతావరణం లో ఉపయోగించడం చాల ఉత్తమము. 

 వర్షాకాలం లో ఎంత జీవామృతం ను ఉపయోగిస్తే అంత మంచిగా ఉంటుంది నెలలోని సారం. 


 2. రెండు మొక్కల మధ్యలో నేల మీద ఒకటి లేదా రెండు  కప్పులు డైరెక్టుగా పోయడం (తడి నేల లో పోయాలి) :- 

 పండ్ల చెట్లకి ప్రతి నెలకి ఒకసారి మధ్యాహ్నం చెట్టు నీడ పరిదిలో భూమి మీద వేయాలి. 

 మొదటి 6 నెలలు ప్రతి ఒక్క మొక్కకి 100 ML నెలకి , తరువాతి 6 నెలలు నెలకు200 ML . 

 తరువాతి 12 నెలలు నెలకు 500 ML ,

 రెండు సంవత్సరాల తర్వాత 1 లీ జీవామృతం ఒక మొక్కకి. , 3 సంవత్సరం నుంచి మొక్కకి 2 లీ. నెలకు చొప్పున ఉపయోగించాలి. 

 జీవామృతం ను బట్టతో 2 సార్లు వడపోసి ఎకరానికి 2 - 4 లీ . పిచికారిగా ఉపయోగించవలెను. 

 ఇలా పిచికారీ చేయడం వల్ల మొక్కలు బాగా బలంగా తయారై ఆకుల వైశాల్యం పెరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచే శక్తి వస్తుంది. 

 మొక్కలకు రోగ నిరోధక శక్తి వస్తుంది. జీవామృతం మొక్కలకు అవసరమైన సూక్ష్మజీవుల ను దగ్గర చేసి. మొక్కలకి హాని కలిగించే సూక్ష్మజీవుల ను నశింపచేస్తుంది. 

 జీవామృతం ఒక మంచి ఫంగస్ నివారినిగాను, వైరస్ నివారింగాను ఉపయోగపడుతుంది. ఖరీఫ్ / రబీ పంటలలో ఋతు సంబంధ పంటలలో:- 

 3. పిచికారి :- 

 1) విత్తులు లేదా మొక్కలు నాటిన వెంటనే 100 లి. నీటి లో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. 


 2) 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. . 


 3) 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.


 4) గిoజలు పాలుపోసుకునే దశలో లేదా పూలు మొక్కలు ఐతే మొగ్గ దశలో 200 లి,. నీటిలో 5 -6 లి. పుల్లటి (3 రోజులు పులిసిన ) మజ్జిగ ను పిచికారీ చెయ్యాలి. 


 పండ్ల తోటల్లో :-

1. పండ్లు కోతలు ముగిసిన వెంటనే 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. . 

 2. కొత్త చిగుర్లు వచ్చేప్పుడు ఆకులు ఎర్ర రంగునుంచు వచ్చేప్పుడు 200 లీ. నీటిలో 20 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .

 3. పూత వచ్చిన సమయంలో 200 లి. నీటిలో 200 లి. దసపరిని కాషాయం లేదా 20 లి. నీమాస్రం ని ఉపయోగించాలి. మల్లీ 21 రోజులు తర్వాత మల్లి పిచికారీ చేయాలి. 

4. పండ్లు చిన్నగ ఉన్నపుడు 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.

5. పండ్లు మీడియంగా కయ దశలో ఉన్నపుడు 200 లి. నీటిలో సప్త ధాన్యంకురా కషాయం ను పిచికారీ చెయ్యాలి. 

 కొత్త తొట్లలో :-

1) నాటిన నెల రోజులకి , ఎకరానికి 100 లీ. నీటిలో 5 లి. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. . 

 2) 21 రోజుల తరువాత 150 లి. నీటిలో 10 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి. .

 3) 21 రోజులు తరువాత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.

 4) నెల రోజుల తర్వాత 200 లి. నీటిలో 5 - 6 లి. పుల్లటి మజ్జిగ 

 5) నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.

 6) నెల రోజుల తర్వావత 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం ను కలిపి పిచికారీ చేయాలి.

ఘన జీవామృతం

ఒక ఎకరానికి కావాల్సిన పదార్ధాలు:


దేశీయ ఆవు పేడ 100 కేజీలు, 

దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, 

బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, 

ద్విదళ పప్పుల పిండి (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు, 

పుట్ట మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు

తయారీ:

పైన పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి. 

పూర్తిగా ఆరిపోయిన తర్వాత పొడిగా చేసుకొని గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి

మరో ఘన జీవామృత రూపం : 

200 కేజీల బాగా క్రుళ్ళిన ఆవు పేడ, 

తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.

తయారీ:

ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది. 

ఒక ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. 

పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు అందించవచ్చు.