Sunday, December 22, 2019

తులసి యొక్క అద్భుతం

తులసి ఆకు చేసే అద్భుతం ఈ మధ్య అందరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ర్టిక్ ట్రబుల్. దీనికి తులసి మంచి పరిష్కారం. నల్ల తులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి ఆ మిశ్రమాన్నినూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

తులసి ఆకు చేసే అద్భుతం తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టిపొడి చేసి తేనెతోగానీ, పెరుగుతోగానీ కలిపి తీసుకుంటే.. అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకి మూడుసార్లు తీసుకుంటే.. మరీ మంచిది.

మలేరియా వచ్చిందంటే.. ఎన్ని మందులు వాడినా.. ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు 5 నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు. తులసి రసం.. అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే.. ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.




No comments:

Post a Comment