Tuesday, December 31, 2019
💐 మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐
Monday, December 30, 2019
ఆచ్చాదన / మల్చింగ్
కావల్సినా పదార్ధాలు :
పొలంలో మట్టిని ఎండనుండి, వాననీటి కోత నుండి, గాలినుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్చాదన కల్పించడం అని, మల్చింగ్ చేయడం అని అంటారు. అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా వుండదు. కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్ధ పదార్ధంతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు. భూమికి అచ్చాదన మూడు రకాలుగా కల్పించవచ్చు.
అవి :
1. మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్చాదన అంటారు.
2. ఎండు గట్టి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు - వీటితో నేలను అచ్చాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు.
3. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ రకాల మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్చాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్చాదన అంటారు.
-
Sunday, December 29, 2019
అంతర పంటలు - మెళకువలు
అంతర పంటలు (ప్రధాన పంటల వరసుల మధ్య పండించే పంటలను అంతర పంటలు అంటారు)
అంతర పంటల సాగుకు గమనించవలసిన ముఖ్యాంశాలు :
సాలీన వర్షపాతం 650-750మి.లీ వరకు పడే ప్రాంతాల్లో భూమిలో తేమ నిల్వ చేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్కువ వుంటే ఆ పొలాలు అంతర పంటలుగా వేసుకోవడానికి అనువైనవి.
అంతర పంటగా వేయడానికి అనువైన పంటను,వంగడాన్ని ఎంపిక చేసుకోవాలి.అంతర పంటగా ఎన్నుకున్న పంటలు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుని కొంత దిగుబడి నిచ్చేవిగా ఉండాలి.
అంతర పంట సాగు విధానంలో భాగస్వామ్య పంటలను సరైన నిష్పత్తిలో వేసుకోవాలి.
అంతర పంటలలో,ప్రధాన పంట నుండి దిగుబడి చూడాలి.అంతర పంట నుండి తగ్గకుండా అదనపు దిగుబడి లాభం పొందాలి.
మన రాష్ట్రం లో సాగులో ఉన్నా లాభదాయకమైన అంతర పంటలు
| అంశం | సాధారణ పద్ధతి | శ్రీ పద్ధతి |
|---|---|---|
| 1 | వేరుశనగ + కంది | 7:1 or 11:1 |
| 2 | ఆముదం+కంది | 1:1 |
| 3 | మొక్కుజోన్న +కంది | 2:1 |
| 4 | జోన్న +కంది | 2:1 |
| 5 | సజ్జ +కంది | 2:1 |
| 6 | పెసర/మిరప +కంది | 2:1 |
| 7 | కంది | 5:1 |
| 8 | పత్తి+ సోయాచిక్కుడు | 1:1 |
| 9 | పత్తి +కంది | 1:1 or 2:1 |
| 10 | ఆముదం+వేరుశనగ | 1:5 |
అంతర పంటల విధానం వలన ప్రయోజనాలు :
అంతర పంటలు సాగుచేయడం ద్వారా ప్రధాన పైరు మొక్కల మధ్య వున్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడునట్టు చేయవచ్చును. స్థలమే కాకుండా సూర్యరశ్మి,నీరు పోషకాలు కూడా బాగా ఉపయోగించుకుంటాయి.
ప్రకృతి వైపరీత్యాల వలన ఒక పైరు దెబ్బతిన్న మరో పైరు ఎంతో కొంత దిగుబడి నిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది లేదా రెండు పైర్ల నుండి కూడా అధిక దిగుబడులను పొందవచ్చును.
అంతర పంటలు సాగు విధానం ద్వారా నేలకోత తగ్గుతుంది.
అంతర పంటలు సాగు ద్వారా కీటకాలు ,తెగుళ్ళు,కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి.
అంతర పంటలు అపరాల జాతికి చెందినవైతే,ప్రధాన పంటలకు కొంత మేర నత్రజని అందే అవకాశం వుంది.
అంతర పంటలు సాగు ద్వారా చిరుధాన్యాలు,నూనె గింజలు,పప్పుధాన్యాలు మొదలైన పంటల ఉత్పత్తి పెంచుకోవచ్చును.
Friday, December 27, 2019
మట్టిలో బంగారం
1. మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు ఉంటే పంటలు అధ్బుతంగా పండుతాయి.
2. వానపాములు రోజుకు 150 జతల ఎడ్లు చేసినంత పని చేస్తాయి. ఇవి భూమికి బొరియలు చేస్తూ నేలను గుల్లబరచడమే కాకుండా 15 అడుగుల లోతు మట్టిలో నుంచి పోషకాలను మొక్కల వేళ్ళకు అందిస్తాయి. వానపాముల ద్వారా ఎకరానికి ఏటా 90 కిలోల నత్రజని సహజంగానే అందుతుంది.
3. అచ్చాదనం (మల్చింగ్) లో చెట్లనుండి రాలిన ఆకులు, పువ్వులు మట్టిలో కలిసేలా చూడాలి.
4. పంట కోత కాలం తర్వాత ఆకులను, మొక్కలను కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగించవచ్చు.
5. ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగు చేయవచ్చు.
6. దేశీయ ఆవు పేడలో కోట్ల మిత్ర సూక్ష్మ జీవులు ఉంటాయని పాలేకర్ రుజువు చేశారు.
7. ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోను 7 రోజుల లోపు పేడనే వేయాలి.
8. ఏదో ఒకే రకం పంట వేయకూడదు. అనేక రకాల పంటలు, ఏళ్ళ తరబడి పెరిగే చెట్లను కలిపి పెంచాలి.
9. రైతు వేసే ప్రధాన పంటలతోపాటు ఒకటి, రెండు అంతరపంటలు కూడా వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.
10. కలుపు మొక్కలను అచ్చాదన కోసమే ఉపయోగించాలి. కనుక కలుపు మందులు వాడరాదు.
11. పురుగు మందులు వాడరాదు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి అవసరాన్ని బట్టి ఏదో ఒక కీటకనాశని వాడితే సరి.
12. ఏ పంట అయినా మొక్కకు మొక్కకు మధ్య సరిపోయే దూరం ఉండాలి.
13. సేంద్రీయ వ్యవసాయంలో కూలీల ఖర్చు తప్ప రసాయన మందుల ఖర్చు ఉండదు.
14. సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టిన 2, 3 సంవత్సరాల వరకూ ఎటువంటి ఆదాయాలు కనిపించవు. స్వల్ప ఆదాయం మాత్రం కనిపిస్తుంది. 4వ/ 5వ సంవత్సరాల నుండి అధిక లాభాలు కనిపిస్తాయి.
15. ప్రాకృతిక వ్యవసాయంలో పెట్టుబడి వుండదు కావున రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి.
16. సేంద్రీయ వ్యవసాయం వలన ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.
17. రసాయన పద్ధతిలో పండించే పంటలకంటే పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు ఎక్కువ మద్దత్తు ధర లభిస్తుంది.
18. సేంద్రీయ వ్యవసాయంలో నీటి ఖర్చు, కరెంటు ఖర్చు తగ్గుతుంది.
19. సేంద్రీయ వ్యవసాయానికి రైతులు బ్యాంకులనుండి అప్పులు చేయక్కర్లేదు, ప్రభుత్వము రైతులకు రుణమాఫీలు చేయక్కర్లేదు.
20. సేంద్రీయ వ్యవసాయం వలన వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది
Thursday, December 26, 2019
సూశ్మజీవులు మొక్కల సహజీవనం
సూక్ష్మ జీవి అనునది మనం కంటితో నేరుగా చూడలేని జీవి.
ఇవి సామాన్యముగా మానవ శరీరము మీద , జంతువుల /మనుష్యుల ప్రేగుల లోపల మన ఇంటి లోపల , గాలిలో ,నీటిలో వుంటాయి.
సూక్ష్మజీవుల జాతి భేదములు
సూక్ష్మ జీవులలో
1 . సూక్ష్మ జంతువులు.
2 . శిలీంద్రములు
3 . బాక్టేరియములు .
అను ఈ మూడు ముఖ్య విభాగాలు ఉన్నాయి.
మనం తెలుసుకోవలసినది ముఖ్యముగా
సూక్ష్మ జీవులు మొక్కల మధ్య సహజీవనం:
వివిధ రకాల సూక్ష్మ జీవులు మొక్కకు కావలసిన పోషక పదార్థాలను నేల పొరల్లో ఉండే వాతావరణం మరియు మట్టినుండి గ్రహించి మొక్కకు అందిస్తాయి. ఈ సూక్ష్మ జీవులకు కావలసిన కార్బోహైడ్రేట్సు మొక్కల వేర్ల ద్వారా వాటికి అందుతాయి.
మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి.
మొక్కలు పోషకపదార్థాలను నేరుగా గ్రహించవు.
మొక్కలు వాటి ఆకులలోని స్టోమాట ద్వారా సౌరశక్తిని,కార్బన్ డైయాక్సైడ్ ను తీసుకొని ఆకులలో నిల్వఉంచుతుంది.
సౌరశక్తి ద్వారా కార్బన్ డైయాక్సైడ్ కార్బన్ మరియు ఆక్సిజన్లుగా విడగొట్టబడతాయి.
మొక్క వెర్లనుండి గ్రహించిన నీటిఆవిరి కార్బన్ కలిసి కార్బోహైడ్రేట్స్ గా ఏర్పడతాయి.
1 చదరపు వైశాల్యం గల ఆకు ఒక రోజుకు 4 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను తయారుచేస్తుంది.
ఇలా ఉత్పత్తి ఐన కార్బోహైడ్రేట్స్ లో కొంత పరిమాణం మొక్క శ్వాసక్రియకు మొక్కఎదుగుదలకు ఉపయోగపడుతుంది,
కొంత పరిమాణం మొక్కల వేర్లు ద్వారా సూక్ష్మజీవులకు అందిస్తాయి.
అందుకు బదులుగా ఈ సూక్ష్మజీవులు నేల నుండి పోషకాలను గ్రహించి వాటిని వేర్లకు అందిస్తాయి.
కోటాను కోట్ల అనేక రకాల మేలు చేసే సూక్ష్మ జీవులు మనకు దేశవాళీ ఆవు పేడ, మూత్రం నుండి లబిస్తాయి. వీటి సంఖ్యను లెక్కకు మించి మనము జీవామృతం తయారీ చేత పొందవచ్చు.
Tuesday, December 24, 2019
వాన పాములు
దేశీ వానపాములు నేలలో పైకి క్రిందకి పయనిస్తూ కోట్ల కొలది చిల్లులు చేస్తుంది. వీటి వల్ల వర్షపు నీరంతా భూమిలోకి చేరుతుంది. ఒక్క చుక్క కూడా నేలపై ప్రవహించదు.
దేశీ వానపాములు నేల లోపలి పొరల్లోని పోషకాలను ఆహారంగా తీసుకోని పై పొరల్లో విసర్జించి మొక్కల వేర్లకు అందుబాటులో ఉంచుతుంది.
భూమి లోపలి పొరల్లో ప్రాణవాయివు పై ఆధారపడని కొన్ని రకాల సూక్ష్మజీవుల నిరంతర క్రియా శీలత వల్ల కార్బన్ డై ఆక్సెడ్ ,అమోనియా,మిథేన్ వంటి విషవాయువులు వెలువడుతూ వుంటాయి అవి అన్నీ ఈ రంద్రముల ద్వారా పైకి ఆవిరి అవుతాయి.వీటి ద్వారా స్వచ్ఛమైన గాలి లోనికి చేరి మేలు చేసే ప్రాణ వాయువు ఆధారిత సూక్ష్మజీవులకు ఉపయోగపడుతుంది.
కుండపోతగా రోజుకు రెండు వందల మిల్లీ లీటర్ల వరకు cloud burst వంటి వర్షం పడినా కూడా ఆ నీరంతా భూగర్భ జలాశయానికి చేరుతుంది. ఈ విధంగా ఇది ఉచిత వాటర్ షెడ్ మేనేజ్మెంట్.
ఈ దేశీ వానపాములు ఎంతో చక్కగా 15 అడుగుల లోతుగా కూడా ఉచితంగా నేలను దున్నిగుల్లగా చేస్తాయి. ఋతుపవనాలు ముగుసిన తరువాత ఈ రంద్రాలగుండా భూగర్భ జలాశయంలోని నీరు కేశాకర్షణ శక్తి ద్వారా పైపొరలకు చేరుతూ మన పండ్ల తోటలకు తీవ్ర కరువు పరిస్థితులలో కూడా తేమ అందుబాటులో ఉండేలా చేస్తుంది.
తవ్వే క్రమములో దేశీ వానపాములు ఆహారంగా మట్టిని,ముడి రాతిని,ఇసుకను,సున్నపు రాయిని , ప్రమాదకర సూక్ష్మజీవులని తింటూ దీనితో పాటు పోషకాల బాండగారమయిన నేల లోపలి పొరల్లోని మట్టిని కూడా తింటాయి. ఇలా తినే క్రమంలో అవి పంటలకు హాని చేసే ప్రమాదకర సూక్ష్మజీవులని ఆహరంగా తీసుకుని తమ ప్రేగులలో అంతం చేస్తాయి. ఇలా మట్టిని తినే క్రమములో ఇవి నేలలోని బలహీనమైన మేలు చేసే సూక్ష్మజీవులని తిని కడుపులో వాటిని బలోపేతం చేసి నెల పై పొరలలో విసర్జిస్తాయి. వాటి కడుపులో వుండే పిండి మర వంటి బయో రియాక్టర్ లో ఇలా తీసుకున్న వాటి అన్నిటిని పిప్పిగా చేసి నేలపై విసర్జిస్తాయి. ఈ విధంగా ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాహార బాండాగారం.
ఈ వానపాముల మలము లో నేలలో కంటే 7 రెట్లు ఎక్కువగా నత్రజని ఉంటుంది,9 రెట్లు ఫోస్పాట్ ఉంటుంది,4 రెట్లుపొటాషియం ఉంటుంది,6 రెట్లు కాల్షియమ్,8 రెట్లు మేగ్నిషియం,10 రెట్ల గదంకం(సల్ఫర్) నేలలో కంటే వానపాము మలములో ఎక్కువగా ఉంటాయి. దీని తో పాటు మొక్క ఎదుగుదలకు కావాల్సిన సూక్ష్మపోషకాలు కూడా ఎన్నో రెట్లు నేలలో కంటే ఎక్కువగా ఉంటాయి.
మొక్క మీద పోషకాల బాండాగారామయిన ఈ వానపాము మలము నుంచి మీ పంటలకు, తోటి మొక్కలకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి గనుక పై పాటి ఎరువులు అవసరమే లేదు.
నేలను దున్ని పోషకాలను , నీటిని అందించే నేలను వాతావరణాన్ని శుద్ది చేసి ఉచితంగా ఇవన్నీ చేస్తున్న దేశీ వానపాము రైతుకు ఆప్తమిత్రుడు.
పంటలకు పోషకాలను అంధించే దేశవాళి వానపాము లేకుంటే త్రాగు,సాగు నీరు లబించేది కాదు.అడవులు మోలిచేవి కావు.
వానపాము అంటే varmi compost తయారికి ఉపయోగించేది (ఎసినో పేటిడ) కాదు. వానపాము అంటే మన దేశీ వానపాము.
ఎందుకంటే దేశీ వాన పాములో ఉండే 16 ప్రతేక లక్షణాలలో ఒక్కటి కూడా ఎసినో పేటిడలో లేదు. ఎసినో పేటిడ నేల పై పనిచేసే ఒక ప్రమాదకర కీటకం. వానపాములో ఈ పేరు మట్టిని తినడం వల్ల దానికి ఎర్త్ వార్మ్ అని పేరు వచ్చింది.ఎసినో పేటిడ మట్టిని తినదు అది పేడను తింటుంది అందువల్ల దానిని ఎర్త్ వార్మ్ అని పిలవలేము. వానపాము నేలను 15 అడుగులవరకు తవ్వగలదు.ఎసినో పేటిడ నేల ఉపరితలం పైనే ఉంటుంది కాబట్టి నేలను తవ్వలేదు. ఆహరం లబించకపోతే వానపాము నేల లో తేమ ఉన్న చోటుకి వెళ్లి సుప్తావస్థలో ఉంటుంది.ఎసినో పేటిడ అలా జీవించలేదు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రత 54℃ ఉండే ప్రాతంలో అయినా 0℃ ఉండే హిమాలయాలలో అయినా వానపాములు నిరంతరము పనిచేస్తూనే ఉండగలవు. కాని 28℃ ఉష్ణోగ్రత దాటితే ఎసినో పేటిడ బ్రతకలేదు. ఒక వైపు దేశీ వానపాములు నేలలోని విషాన్ని తొలగిస్తే మరో వైపు ఎసినో పేటిడ కాడ్మియం,ఆరేనిక్స్,పాదరసం,సీసం వంటి ప్రమకరమైన విషయాలను నేలలో వదులుతుంది.
దీనిని బట్టి వ్యవస్థలో సకల జీవరాసులకు పోషకాలను అందిచడంలో సూక్ష్మజీవులు,దేశీ వానపాముల ప్రాముక్యత గమనించగలరు.
Monday, December 23, 2019
ఒక చెట్టు - దాని ఔన్నత్యం
మన ఆవులు - విశిష్ఠతలు
ఆవుల మందను చూసి ఆడపిల్లని ఇవ్వాలి అనేది పెద్దల మాట. పాడి ఉన్న చోట పంట ఉంటుందని, ఇవి ఉన్న ఇంటిలో ఆడపిల్ల హాయిగా బతుకుతుందని నాటి పెద్దల భరోసా. పాడికి పంటకు ఉన్న సంబంధం దండలో దారం లాంటిది.. ఒక్కమాటలో.. పంటకు పేడే పెన్నిధి!
పంట భూములను సారవంతం చేయాలంటే పశువుల పేడను ఏదో ఒక రూపంలో వాడటమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి మెరుగుపరచిన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వరకు.. పశువుల ఎరువు దగ్గర నుంచి జీవామృతం వరకు.. అన్నిటిలోనూ మోతాదు మారినా పేడ వాడకం మాత్రం తప్పనిసరి.
ఆవు పేడతో ఉపయోగాలెన్నో!
ఆవు పేడ ఉపయోగాలేమిటి? అని అడగటం అంటే.. సూర్యుడి ప్రయోజనం ఏమిటి? అని అడగటం వంటిదే!
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు నిస్సారమయ్యాయి. తిరిగి సారవంతం చేయడం ఆవు పేడ, మూత్రంతోనే సాధ్యం.
ఇంతకూ పేడలో ఏముంది?
మనిషిని, అతని చుట్టూ ఉన్న ప్రకృతిని దేవుడు శాసిస్తుంటాడనేది కొందరి విశ్వాసం. జీవుల మనుగడ వెనుక కంటికి కనిపించకుండా అంతటా ఆవరించిన శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్ధారిత నిజం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో కోటాను కోట్ల సూక్ష్మజీవుల సముదాయమే శక్తి. ఆవు పేడ, మూత్రాలలో హితోపకారులైన ఈ సూక్ష్మజీవుల సముదాయాలు కోటాను కోట్లున్నాయి. ఒక గ్రాము పేడలో మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులున్నాయని అంచనా. ఇవి తమ జీవనక్రియ ద్వారా మనిషి మనుగడకే కాదు.. నేల మీద ఉనికిలో ఉన్న అన్ని రకాల జీవజాలం మనుగడకు అవసరమైన వనరులను అందిస్తున్నాయి. ప్రధానంగా పంటల విషయానికి వస్తే.. ఇవి నేల, గాలి, నీరులో ఉన్న అన్ని రకాల పోషకాలను సంగ్రహించి మొక్కలకు అందజేస్తున్నాయి.
సూక్ష్మజీవులే పంటకు పోషణ, రక్షణ!
ఆవులపేడ ఎరువు ద్వారా పొలం మట్టిలోకి చేరిన ‘మేలు చేసే’ సూక్ష్మజీవులే మన పంటలకు పోషకాలను అందిస్తున్నాయి. కీడు చేసే ఇతర రకాల బాక్టీరియా, వైరస్, శిలీంద్రాలను నియంత్రించే కాపాలాదారులుగా కూడా వ్యవహరిస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మన ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గు పెట్టుకునే సంప్రదాయం వెనుక దాగిన సత్యం ఇదే. ఇవి విరామమెరుగక చెమటను చిందించే రైతు కంటే ఎక్కువగా అనుక్షణం శ్రమిస్తుంటాయి. ఇవే కాకుండా మొక్కల మనుగడకు, ఎదుగుదలకు అవసరమైన స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఉన్నాయి. వీటికి తోడు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్, రాగి, సల్ఫర్, మాంగనీస్, మల్బేడినమ్, వనాడియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు పంటలకు అత్యవసరమైన అమినో ఆమ్లాలు పేడలో ఉన్నాయి. తొలి వ్యవసాయ సమాజాలు ఏర్పడిన నాటి నుంచి కొనసాగిన అనుభవాలను క్రోడీకరించి పూర్వీకులు ప్రాచీన భారతీయ వ్యవసాయ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ‘కృషి పరాశర’, ‘వృక్షాయుర్వేద’, ‘కృషివల్లభ’, ‘కాష్యపీయ కృషి సూక్తి’, ‘లోకోపకార’ తదితర ప్రాచీన భారతీయ వ్యవసాయ విజ్ఞాన గ్రంథాలన్నిటిలోనూ పశువుల పేడ, పశువుల మూత్రంను వివిధ పద్ధతుల్లో వ్యవసాయానికి ఎలా వాడేదీ వివరించారు. పేడ, మూత్రంలను ఎరువులుగా, చీడపీడల నివారిణులుగా ఉపయోగించడం గురించి విశదపరిచారు.
ఏభయ్యేళ్ల క్రితం వచ్చిపడిన పారిశ్రామిక వ్యవసాయ విధానంతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మజీవరాశికి నిలయమైన పేడ తదితర సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యం తగ్గి.. వివిధ రకాల రసాయనాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. ఫలితంగా వ్యవసాయం అభివృద్ధి మాటెలా ఉన్నా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. కాలం అకాలమై, రుతువులు గతి తప్పాయి. ఈ విషయాన్ని వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలు మొదలు సాధారణ వ్యవసాయ కూలీల వరకు అందరూ గుర్తించారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం తిరిగి తన మూలాలను శోధించుకోవాల్సి వస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు ఉద్యమ స్థాయికి చేరుకున్నాయి. కృత్రిమ రసాయనిక ఎరువుల స్థానంలో.. పేడ, మూత్రంలతో తయారైన సహజ ఎరువులు భూమికి బలిమిని, రైతుకు కలిమిని ఇస్తున్నాయి. ఎందరో రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు ఖర్చులు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు పొందుతున్నారు.
రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
ప్రకృతి వ్యవసాయం
భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.
పంచ మహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉంది.
పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే = పంచభూతాలు.
పృథివి = భూమి
అప్ = నీరు
తేజస్ = అగ్ని
వాయు: = గాలి
ఆకాశ = ఆకాశం
వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి
పంచ భూతాలు గురించి మన వేద శాస్త్రాలలో వివరించింది తత్వ సహితంగా కేవలం భౌతిక అర్థ సహితంగా కాదు
భూమి అంటే అన్ని ఘన పదార్థాలు భూ తత్వం కలిగి ఉన్నాయి
జాలం అంటే అన్ని ద్రవ పదార్థాలు జల తత్వం కలిగి ఉన్నాయి
వాయు అంటే వాయు పదార్థాలు వాయు తత్వం కలిగి ఉన్నాయి
అగ్ని అంటే ఉష్ణం
ఆకాశం అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ రెడియేషన్
పంచ భూతాలు - సమతుల్యత - కర్మ సిద్దాంతం: -
పంచ భూతాల మద్య గల సృష్టి మరియు నియంత్రణ సిద్దాంతం పై ఆదారపడి వాస్తు పలితాలు వస్తాయి. ప్రతి గృహంలో, కార్యాలయంలో, పరిశ్రమలల్లో,వ్యవసాయంలో పంచభూతాల మద్య సమతుల్యత దెబ్బతినకుండ నిర్మాణాలు/ నిత్య కృత్యాలు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రావు.
పంచ భూతాల సృష్టి - సిద్దాంతం ప్రకారం ఆకాశం నీటిని, నీరు వాయవును, వాయువు అగ్నిని, అగ్ని భూమిని, భూమి ఆకాశాన్ని సృష్టిస్తుంది ఇది ఒక చక్రం ఒక ధానిపై మరి ఒకటి ఆదారపడి ఉండును. అలాగే పంచ భూతాల నియంత్రణ సిద్దాంతం ప్రకారం ఆకాశము వాయువు ను, వాయువు భూమిని, భూమి నీటిని. నీరు అగ్ని ని, అగ్ని ఆకాశాన్ని నియంత్రిస్తాయి.
ఒక పద్దతి ప్రకారం పంచ భూతాల సృష్టి / నియంత్రణ నిరంతరం జరిగి విశ్వంలో జీవం కొనసాగడానికి దొహద పడుతుంది. సహాజత్వానికి దగ్గరగా జీవించే వారు మంచి ఆరొగ్యవంతులుగా ఆనందకరమైన జీవితాన్ని అనుబవిస్తారు
మానవాళి తనకు అనుకూలంగ ప్రకృతికి విరుద్దంగ / తమ అవసరాలకు అనుగునంగ నివాసాలను, వ్యవసాయాన్ని చేసుకోవడం వలన పంచ భూతాల ప్రభావం / సహాకారం లో సమతుల్యత లోపించి ఆరోగ్య/ఆర్దిక/సంసారిక/సామాజిక సమస్యలను ఎదుర్కోంటున్నారు.
ఏ లాంటి సమస్యలు లేకుండ ప్రంశాంతతో జీవించాలంటె నివాసంలో,వ్యవసాయంలో పంచభూతాల సమతుల్యతను సాదించి ఆకాశం నుండి సహకారాన్ని ఎ విదముగ తీసుకొనవలెనో తెలుసుకొని నీర లక్షణం నుండి మీరేంటో తెలుసుకోని సృష్టి అంతయు నిండి వున్న వాయువు నుండి గత జన్మ కర్మానుసారంగ జీవిస్తూ అగ్ని లోని మంచి లక్షణాన్ని గ్రహించి అందరూ సమానమనే భావనతో న్యాయబద్దంగ ధనాన్ని సంపాదిస్తూ భూమి ధ్యార సహనాన్ని నేర్చుకొని ఇతరులకు సహాయం చేయుచూ సమాజంలో మంచి హోధాను సాదిస్తారు.
Sunday, December 22, 2019
తులసి యొక్క అద్భుతం
తులసి ఆకు చేసే అద్భుతం తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టిపొడి చేసి తేనెతోగానీ, పెరుగుతోగానీ కలిపి తీసుకుంటే.. అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకి మూడుసార్లు తీసుకుంటే.. మరీ మంచిది.
